NGKL: అచ్చంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ఇవాళ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి డయాగ్నోస్టిక్ కేంద్రాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు సమయానుకూలంగా పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.