చమురు కొరత వేళ రిఫైనరీలు విదేశాలకు ఇంధనాన్ని తరలించకుండా ఉండేందుకు ఎగుమతులపై పన్ను విధించినట్లు కేంద్రమంత్రి నిర్మలమ్మ తెలిపారు. తద్వారా చమురు కంపెనీలు లాభాల కోసం చూడకుండా దేశీయ మార్కెట్‌కే ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నా సామాన్యుడిపై భారం పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.