విశాఖపట్నంలోని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత కె.కె. రాజు ఆధ్వర్యంలో పేడాడ రమణికుమారి హాజరై స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సతీశ్ వర్మ, నరసింగరావు పాల్గొన్నారు.