టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. కావ్య అనే యువతితో ఆయన ఏప్రిల్ 5న నిశ్చితార్థం చేసుకోనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి వివాహం నిరాడంబరంగా జరగనున్నట్లు టాక్. అనంతరం మే 1న HYDలో సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారట. త్వరలోనే శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతుండటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.