TG: రాష్ట్ర రాజకీయాల్లో MLC తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలకు, వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం కల్పించడమే ఈ యాత్ర ఉద్ధేశమన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మల్లన్న పార్టీ ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (TRP) వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.