ATP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలోని సున్నపుగేరులో వెలసిన శ్రీ సీతారామస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సందర్శించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.