NLR: రాపూరు మండలం 7వ వార్డులో ఇవాళ డ్రైనేజీలు శుభ్రం చేశారు. కాలుష్యం కాలువల్లో పేరుకుపోయిన చెత్తను వార్డు మెంబర్ ఆరిఫా దగ్గరుండి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, నిర్దిష్ట ప్రదేశాల్లో వేయాలని సూచించారు.