బయోకాన్ ఎండీ, సీఈవోగా శ్రీహాస్ తాంబే ఎన్నికయ్యారు. ప్రస్తుత సీఈవో సిద్ధార్థ్ మిత్తల్ తన పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో తదుపరి ఎండీగా శ్రీహాస్ బాధ్యతలను స్వీకరించనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు శ్రీహాస్ ఈ పదవిలో కొనసాగనున్నారు. గత 20 ఏళ్లకుపైగా బయోకాన్ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నారు. 1997లో ట్రైనీగా ఈ సంస్థలో చేరి అంచలంచలుగా ఎదిగి సీఈవో స్థాయికి చేరారు.