మనిషి ఆయుష్షు దేవుడి చేతిలో కాదు, అతని ప్రవర్తనపైనే ఉంటుందని విదురుడు చెప్పాడు. గర్వం(అహంకారం), అతిగా మాట్లాడటం, కోపం, స్వార్థం, మిత్రద్రోహం, లోభత్వం(పిసినారితనం). ఈ ఆరు లక్షణాలు కత్తుల వలె మనిషి ఆయుష్షును దారుణంగా కోసేస్తాయని విదురుడు హెచ్చరించాడు. వీటిని విడిచిపెడితేనే మనిషి పూర్ణాయుష్షుతో, ప్రశాంతంగా జీవిస్తాడని విదుర నీతి సారాంశం.