ఈ భూమిపై ఎలాంటి మానసిక సంఘర్షణలు లేకుండా పూర్తి ఆనందంగా జీవించేది కేవలం ఇద్దరు మాత్రమేనని విదురుడు చెప్పాడు. మొదటివాడు.. ఏమీ పట్టని పరమ మూర్ఖుడు. రెండవ వాడు.. అన్నీ తెలిసి, దేనిపైనా వ్యామోహం లేని పరమ జ్ఞాని. కానీ సగం తెలిసి, సగం తెలియక, కోరికలకు బానిసలై ఈ రెండింటికీ మధ్యలో ఉండే సామాన్యులు మాత్రం జీవితాంతం కష్టాలను, దుఃఖాలను అనుభవిస్తారని విదుర నీతి సారాంశం.