KDP: గతనెల రోజులుగా అరటి ధరలు ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయాయి. రైతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం టన్ను అరటి రూ.6,000 నుంచి రూ.8,000 పలుకుతున్నాయి. ఈ ధరలు ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. కష్టపడి అరటి పంటలు సాగు చేస్తే.. దిగుబడులు వచ్చే సమయానికి ధరలు పతనమయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.