VSP: సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్లా బొజ్జి రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి మొక్కులు తీర్చుకున్న ఆయన, అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.