AP: గండ్లపాడు జంట హత్యల కేసులో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. గతేడాది మే లో గుండ్లపాడులోని టీడీపీకి చెందిన జెవిశెట్టి వెంకటేశ్వర్లు, జెవిశెట్టి కోటేశ్వరరావు అనే అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు.