VSP: భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక-మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.