TG: తానీషా కాలం నుంచి ప్రభుత్వం తరపున రాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. సాధారణంగా కళ్యాణాల్లో బియ్యాన్ని తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. కానీ భద్రాద్రి రాముడికి మాత్రం అచ్చమైన ముత్యాలను తలంబ్రాలుగా వాడతారు. ఈ ముత్యాలు సీతారాముల అన్యోన్యతకు చిహ్నంగా భావిస్తారు. సీతారాముల కళ్యాణం చూసినా, ఆ తలంబ్రాలు తమపై పడినా సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం.