TG: భూభారతి పోర్టల్‌ను ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూపరిపాలన సేవలను మరింత వేగంగా అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చామన్నారు. ప్రతి భూ లావాదేవీ వివరాలు అందరికీ కనిపించేలా పోర్టల్‌ను రూపొందించామని పేర్కొన్నారు.