కృష్ణా: నాగాయలంక మండలం అవుట్ పోస్ట్ సర్కిల్ వద్ద రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో, పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశామన్నారు. దీంతో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారీపై కేసు నమోదు చేసి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.