కడప: జిల్లాలో PNG ఉన్న ప్రాంతాల్లో LPGకి బదులుగా PNGకి బదిలీ కావాలని జిల్లా కలెక్టర్ చెరికూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఎల్పీజీకి ప్రత్యమ్నయంగా పైపుడ్ నేచురల్ గ్యాస్ వినియోగించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.