NDL: రాయలసీమ ప్రజలకు వరప్రదాయని పోతిరెడ్డిపాడు పనులు ఎప్పటికీ పూర్తయ్యెను అంటూ సీమ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో పోతిరెడ్డిపాడు దిగువ ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులతో పాటు బానకచర్ల క్రాస్ హెడ్ నుంచి ఎస్ఆర్బీసీ కాల్వ విస్తరణ పనులు చేపట్టడానికి రూ.1,065 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు.