HYD: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సికింద్రాబాద్కు చెందిన నేతన్న ఎస్. ఎస్. జయరాజ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ పరంపరగా కొనసాగుతున్న ఈ సేవలో భాగంగా భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే మగ్గం ఏర్పాటు చేసి, 12 రోజుల్లో ఆరుగురు చేనేత కార్మికులు షిఫ్టుల వారీగా పని చేశారు. రోజుకు 20 గంటలు పనిచేస్తూ స్వామివార్ల వస్త్రాలు వేశారు.