అన్నమయ్య: మదనపల్లి పురపాలక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాసులుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కోళ్లబైలు గ్రామానికి చెందిన మంజుల తన కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లిన సమయంలో హెచ్ఎం అసభ్యంగా ప్రవర్తించి వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.