VKB: తాండూరు నాపరాతి వినియోగానికి ప్రాధాన్యత కల్పించేందుకు ప్రత్యేక GOను ప్రవేశ పెట్టాలని MLA మనోహర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో కోరారు. నాపరాతికి ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. షాబాద్ స్టోన్గా పేరుగాంచిన నాపరాతిని అందరు వినియోగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం టైల్స్, ఇతర పద్ధతులు అమల్లోకి రావడంతో షాబాద్ స్టోన్ వాడకం తగ్గిందని అన్నారు.