VSP: భవిష్యనిధి ఖాతాదారులు, పెన్షనర్లు, పీఎఫ్ సంస్థల యజమానుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27వ తేదీన “మీ వద్దకే భవిష్యనిధి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్-2 నితీష్ కుమార్ తెలిపారు. విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, నాగ హనుమాన్ ఫిష్ ప్యాకర్స్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.