TG: అసెంబ్లీలో ఆరు గ్యారంటీల అమలుపై మంత్రి శ్రీధర్ బాబు, MLA సునీతా లక్ష్మారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. గ్యారంటీలు అమలు కావడం లేదన్న సునీత విమర్శలకు మంత్రి ఘాటుగా స్పందించారు. ‘రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా వెళ్లి చూడండి.. గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో మీకే తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు. పథకాలు ప్రజల చెంతకు చేరుతున్నాయని, విమర్శలు అర్థరహితమని మంత్రి కొట్టిపారేశారు.