AP: కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివన్నపై బదిలీ వేటు పడింది. తక్షణమే విజిలెన్స్ డీజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. అయితే పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఆయన సహకరించినట్లు, అలాగే స్మగ్లర్లతో చేతులు కలిపినట్లు వచ్చిన తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.