TG: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అత్యంత కీలకమైన పద్దులపై చర్చలతో కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించడం ఏంటని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.