SRD: కంగ్టి మండలం దమరగిద్ద (పి) గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామస్తుల ఆధ్వర్యంలో దమరగిద్ద నుండి తడ్కల్ వరకు రాముని విగ్రహంతో భారీ శోభయాత్ర నిర్వహించారు. తడ్కల్ ప్రధాన కూడలి వద్ద డీజే పాటలకు హనుమాన్ స్వాములు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.