MLG: ములుగు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవీందర్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లపై మాత్రమే దృష్టి పెట్టి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాల సమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.