ప్రకాశం: సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో S.కొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సివిల్ జడ్జి లీలా శ్యాంసుందరి గురువారం ప్రారంభించారు. వేసవి కాలంలో కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక బాధ్యతతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.