NRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఎస్సై గాయత్రి అన్నారు. గురువారం నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో జరుగుతాయని అన్నారు.