TG: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో రేపు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. కోఠి సీతారాంబాగ్ దేవాలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభయాత్ర జరగనుంది. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదు. శోభాయాత్ర సమయంలో ఇతర మార్గాల్లోకి మళ్లించనున్నారు. సీతారాంబాగ్, భోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు ట్రాఫిక్ మళ్లించునున్నారు.