AKP: ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు, పీఎం సూర్యఘర్ పథకాలకు, వ్యవసాయానికి రుణాలు అందజేయాలన్నారు. రుణాలను అందించి అన్ని బ్యాంకులు లక్ష్యాలను సాధించాలన్నారు.