TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును ప్రభుత్వం పెంచింది. PRC గడువును సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ N.శివశంకర్ నేతృత్వంలోని కమిషన్ గడువును పొడిగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కమిషన్ నివేదిక అందిన తర్వాత కొత్త వేతన స్కేళ్ల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.