SRPT: చివ్వెంల మండలం దురాజుపల్లి ఎంఎస్ఆర్ స్కూల్లో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ సదస్సులో ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని కోరారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు.