NZB: పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో ఉన్న ఎంపీయూపీఎస్ను గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను సబ్ కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల గైర్హాజరును తగ్గించడంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.