JN: స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి పాడే మోశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, స్టేషన్ ఘన్పూర్ మార్కెట్ మాజీ ఛైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి నిన్న మరణించారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగగా కడియం శ్రీహరి కార్యక్రమంలో పాల్గొని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ MLAలు ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిలతో కలిసి పాడే మోసి, భావోద్వేగానికి గురయ్యారు.