NRPT: ధన్వాడ మండల కేంద్రంలో పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ వృద్ధులు గురువారం నారాయణపేట – మహబూబ్నగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2,016 పెన్షన్ సకాలంలో అందడం లేదని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 5లోపే పెన్షన్లను పంపిణీ చేయాలన్నారు.