ATP: మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో మండల కన్వీనర్లు, ఇన్ఛార్జిలతో సమీక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉత్సాహంగా వేడుకలు జరిపి కార్యకర్తల ఐక్యతను చాటాలని ఆమె ఆదేశించారు.