కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడి ఎంపీయూపీ పాఠశాలను గురువారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న రాగి జావ నాణ్యత పరిశీలించారు. పథకం మెనూ ఖచ్చితంగా అమలు చేసి ప్రభుత్వ ఆకాంక్షల ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని హెచ్ఎం బీఎస్ఎన్ జ్యోతికి సూచించారు.