NTR: జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 75 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రామాభివృద్ధికి రహదారులు, వంతెనలు సహా పలు పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.