GNTR: రాజధాని 2వ దశ అభివృద్ధికి CRDA కసరత్తు ముమ్మరం చేసింది. 1,75,347 ఎకరాల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థకు అప్పగించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, వాణిజ్య ప్రాంతాలు, రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగనుంది. తొలి దశ ప్లాన్‌ను రూపొందించిన ఈ సంస్థే మళ్లీ చేపడుతుండడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి.