KDP: రాజంపేట రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ పనులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వంటి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్లాట్ఫాం-2లో టాయిలెట్లు, షెల్టర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కేబుల్ తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.