SRD: తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సమస్యలు, సిబ్బంది కొరతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినప్పటికీ, మౌలిక సదుపాయాలు, సంబంధిత బోధకులు లేక కుంటుపడిందన్నారు. హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్ పట్ల చర్యలు తీసుకోవాలన్నారు.