AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రమాదానికి గల కారణాలపై జిల్లా యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.