AKP: జిల్లాలో రెండు దశల్లో జనగణన జరుగుతుందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బుధవారం అనకాపల్లి శంకరన్ భవన్లో నిర్వహించిన జనగణన శిక్షణలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనగణన చేపట్టాలన్నారు. మొదటి దశలో బ్లాక్‌ల వారీగా గృహాలు లెక్కింపు జరుగుతుందన్నారు. రెండవ దశలో వచ్చే ఏడాది జనగణన నిర్వహించాలన్నారు. ఎలక్ట్రానిక్ విధానంలో జనగణన జరుగుతుందని ఆయన తెలిపారు.