NRML: గడువులోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయం పైన నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగుల సౌకర్యార్థం అదనపు గదుల నిర్మాణాన్ని చేపడుతున్నామని వారు తెలిపారు.