ATP: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి ఇబ్బందులపై ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపు 9550480972 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వివరించారు.