AP: గతంలో జగన్ నిరంకుశంగా పాలించారిని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం ద్వారా రూ.3,500 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. అక్రమ సంపాదలో అంతిమ లబ్దిదారులు ఎవరని ప్రశ్నించారు. మద్యం కేసులు జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. వ్యక్తిగతంగా కూడా జగన్ ఒంటరివాడయ్యారని పేర్కొన్నారు.