AP: ఇచ్చిన హామీలపై మాట తప్పి, మడమ తిప్పిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. ‘ఇసుక దోపిడితో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు. ఆస్తులు కొల్లగొట్టడం, వ్యవస్థల విధ్వంసం తప్ప చేసిందేమీ లేదు. మద్యపాన నిషేధ హామీతో వచ్చి కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. మా ప్రభుత్వం వచ్చాక గుండ్లకమ్మ ప్రాజెక్టును బాగు చేసింది’ అని వెల్లడించారు.