సత్యసాయి: సోమందేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో రూకలపల్లి గ్రామ పరిసరాలలో జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్ లో మొత్తం 9 మంది జూదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 28,350/- నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసామని తెలిపారు.